ఘనంగా మలికిపురం జనసేన ఎంపిపి జన్మదిన వేడుక

రాజోలు, జనసేన పార్టీ నుండి గెలిచిన మొట్టమొదటి మహిళా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మేడిచర్ల వెంకట సత్యవాణి పుట్టినరోజు వేడుక రాజోలు వీర మహిళల ఆద్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపిపి వెంకట సత్యవాణి కేక్ కట్ చేసి, ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీలో నా మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఎల్లవేళలా నేను కృతజ్ఞురాలినై ఉంటానని, జనసేన పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి ఎల్లప్పుడూ కృషిచేస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు ఉలిశెట్టి అన్నపూర్ణ, చింతా వీరమణి, అశం ఆదిలక్ష్మి, ఉల్లిశెట్టి వేణు, సూర్యవతి, కృష్ణకుమరి, ఆశం సుర్యకూమారి, ధనలక్ష్మి, శాంతి మరియు వీర మహిళలు పాల్గొన్నారు.