రాష్ట్రపతికి చీరకొంగుతో దిష్టి తీసిన ట్రాన్స్ జెండర్ మంజ‌మ్మ.. వీడియో వైరల్..!

పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ప్రముఖ జాన‌ప‌ద నృత్య‌కారిణి, ట్రాన్స్‌ జెండ‌ర్ మంజ‌మ్మ రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్నారు. ఆ సమయంలో రామ్ నాథ్ కి తన చీర కొంగుతో దిష్టి తీశారు మంజమ్మ. శుభం కలగాలని దీవించారు. ట్రాన్స్‌ జెండ‌ర్లు ఇలా దీవిస్తే మంచి జ‌రుగుతందని నమ్ముతుంటారు.

బ‌ల్లారి జిల్లాకు చెందిన మంజమ్మ జోగ‌ప్ప జాన‌ప‌ద నృత్యం నేర్చుకున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తూ.. క‌ల్ల‌వ జోగ‌తి మ‌ర‌ణం త‌ర్వాత ఆ క‌ళాబృందానికి నాయకత్వం వహించారు. అనంతరం కర్నాట‌క జాన‌ప‌ది అకాడ‌మీకి అధ్య‌క్షురాలిగా నియ‌మితులయ్యారు. ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌ ఈ అకాడమీకి అధ్యక్షురాలు కావడం ఇదే తొలిసారి.