రానున్న రోజుల్లో పల్నాడు నుండి భారీగా చేరికలు: జిల్లా అధ్యక్షుడు గాదె

గుంటూరు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలన అంతమొందించడానికి జనసేన ఆవిర్భావసభతో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాంది పలికారని రానున్న కాలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాని చెప్పారు. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామం నుండి 25 మంది వైసిపి, టిడిపి లను వీడి జిల్లా పార్టీ కార్యదర్శి అంబటి మల్లి, మండల పార్టీ అధ్యక్షులు దుర్గారావు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. పల్నాడు ప్రాంతంలో జనసేన బలంగా ఉందని… మరింత బలంగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాలన్నారు. వెనుకబడిన పల్నాడు అభివృద్ధి ఒక్క జనసేనతోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, దాచేపల్లి అధ్యక్షుడు మందపాటి దుర్గారావు, పిడుగురాళ్ల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, వేల్పుల చైత్యన్య, గురజాల నరసింహ రావు, శ్రీనివాసపురం కార్యకర్తలు పాల్గొన్నారు.