రైతులకు మద్దతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా: శివదత్ బోడపాటి

పాయకరావుపేట నియోజకవర్గం, జనసేన పార్టి రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి చెరుకు రైతుల సమస్యలపై స్పందిస్తూ… 1933 నుంచి వున్న ఎటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో రోడ్డున పడ్డ కార్మికుల కుటుంబాలు అలాగే దీనిపై ఆధారపడిన చెరుకు రైతుల పరిస్థితి అయోమయంగా మారిందని… త్వరలో కార్మికులకు, రైతులకు మద్దతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా ఉంటుందని తెలిపారు.