లెజెండ్ అవార్డ్ అందుకున్న ‘మయూరి’ సుధాచంద్రన్

నాట్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్న నృత్య కళాకారిణి సుధాచంద్రన్. సుధాచంద్రన్ ప్రమాద వశాత్తు కాలు పోగొట్టుకొని.. కృత్రిమ కాలు పెట్టుకొని ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె జీవితకథను వెండితెరపై మయూరి పేరుతో తెరకెక్కించారు డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు. ఆ సినిమాలో తన పాత్రను తనే పొషించింది. ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల టెలివిజన్ తెరపై తన ప్రతిభను చూపిస్తున్నారు. అటు హిందీ, తెలుగులో సీరియల్లలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది మయూరీ. తాజాగా ఆమెను లెజెంట్ అవార్డు వరించింది. వి.బి. ఎంటర్ ట్రైన్మెంట్స్ టెలివిజన్ అవార్డ్స్-2020 ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బొప్పన క్రిష్ణ ఆధర్వంలో డిసెంబర్ 27న హైదరాబాద్‏లోని శిల్పారామం, రాక్ హైట్స్‏లో ఈ వేడుకలు జరిగాయి. బుల్లితెర ఉత్తమ నటీనటులకు వారి ప్రతిభ ఆధారంగా ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగింది. ఇందులో సుధా చంద్రన్‏ను లెజెండ్ అవార్డుతో సత్కరించారు. సీనియర్ నటి జీవితా రాజశేఖర్, బాబు మోహన్, శివాజీ రాజా, అంజికా కృష్ణలు.. ఈ అవార్డును సుధాచంద్రన్‏కు అందజేశారు. తనకు ఈ అవార్డు ప్రధానం చేసిన వారికి సుధాచంద్రన్ ధన్యవాదాలు తెలిపారు. సుధా చంద్రన్‏తోపాటు పలువురు బుల్లితెర నటీనటులకు అవార్డులతో సత్కరించారు.