బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించిన మేడ గురుదత్ ప్రసాద్..

  • పాతతుంగపాడు గ్రామంలో పలువురిని పరామర్శించిన జనసేన పార్టీ ఇంచార్జ్ “గురుదత్”

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పాతతుంగపాడు గ్రామానికి చెందిన జనసైనికుడి తనింకి శివ కృష్ణ అకాల మరణం బాధాకరంమంటూ వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేస్తూ జనసేన పార్టీ తరుపున రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించరు. అనంతరం
పాతతుంగపాడు గ్రామంలో జనసేన పార్టీ తరుపున వార్డ్ మెంబెర్ గా పోటీచేసిన లంకపల్లి నారాయణమూర్తి తండ్రి లంకలపల్లి సూర్యచంద్రం గత కొన్నిరోజుల క్రితం ఆపరేషన్ చేయించుకున్నారన్న్స్ విషయం స్థానిక జనసైనికులు ద్వారా తెలుసుకున్న మేడ గురుదత్ ప్రసాద్ వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం రాజానగరం మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ నాగవరుపు భానుశంకర్, మరుకుర్తి శ్రీను, లంకపల్లి నారాయణమూర్తి, గటి చిన్న, కోడె రాజు తదితరులు పాల్గొన్నారు.