నకరికల్లు మండలస్థాయి జనసేన కార్యకర్తల సమావేశం

నకరికల్లు: ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆదేశానుసారం.. నకరికల్లు మండల జనసేన ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక నకరికల్లు గ్రామంలోని నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ లు మాట్లాడుతూ.. మండలంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని, వాటిని ఎలా పరిష్కరించాలి, కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ అధ్యక్షుల సూచనలు తెలియజేశారు. జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మండల కమిటీ నాయకులు నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ బత్తిని శ్రీనివాసరావు, నకరికల్లు మండల వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ బాదినీడి సుబ్బారావు, మండల ప్రధాన కార్యదర్శిలు షేక్ మీరావలి, చట్టు శివ, కొప్పుల భరత్ కుమార్, మొగిలి నరసింహారావు, చిర్తన రామాంజనేయులు, జాయింట్ సెక్రటరీ కొండేటి మస్తానయ్య (త్రిపరాపురం), గ్రామ పార్టీ అద్యక్షులు చేపూరి వెంకటేశ్వర్లు, కొండలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారు.. ఆకుల కొండ, బత్తిని సుబ్బారావు, తాటికొండ అంకారావు, తాడువాయి పెద్దయ్య సీనియర్ నాయకులు, తాడువాయి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ అభ్యర్థి జడ అనిల్ కుమార్, మద్దాల సైదారావు పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో అధిక సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.