క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యాచరణపై క్లస్టర్ ఇంచార్జిలతో సమావేశం

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండల కేంద్రంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమ కార్యాచరణ నిమిత్తం జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న అధ్యక్షతన క్లస్టర్ ఇంచార్జిలతో సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది. సమావేసంలో భాగంగా నియోజకవర్గాన్ని 7 క్లస్టర్లుగా విభజించడం జరిగింది, ఏడుగురు నాయకులను నియమించడం జరిగింది, మండలంలో మూడు వేలు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసే విధంగా కార్యచరణ ప్రణాళిక రూపొందించి, క్లస్టర్ ఇంచార్జిలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిరంజీవి, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శులు నరేష్, అవినాష్, కార్యదర్శి సాయి, సీనియర్ నాయకులు సుధాకర్ ఆచారి పాల్గొన్నారు.