జనసేనాని జన్మదినోత్సవాలలో భాగంగా ఎమ్మిగనూరులో రక్తదాన శిబిరం

ఎమ్మిగనూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 52వ జన్మదిన వేడుకల్లో భాగంగా నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ అధ్యక్షతన జనసేన నాయకులు రాహుల్ సాగర్, కరణం రవి, బాజారి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు 40 మంది దాతలతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ రేఖ గౌడ్ మాట్లాడుతూ నేటి యువతకు స్ఫూర్తిని కలిగిస్తూ సేవా మార్గం వైపు నడిపిస్తున్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం తమకు ఎంతో గౌరవాన్ని ఇస్తుందని పవన్ కళ్యాణ్ గారి ఒక స్ఫూర్తితో నేటి యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని రాబోయే 2024 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షబ్బీర్, వినయ్, రమేష్, నవాజ్, సిరాజ్, శ్యామ్, వెంకటేష్ పాల్గొన్నారు.