గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

యూఏఈ, గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం అబుదాబిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గల్ఫ్ దేశాల జనసేన ఇంచార్జి కేసరి త్రిమూర్తులు, గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ చంద్రశేఖర్ మొగళ్ల, వీరమహిళలు మంజుల మొగళ్ల, సమీరాలు హాజరవడం జరిగింది. రక్తదాన శిబిరం నిర్వహించిన ప్రాంతీయ కన్వీనర్లు అడ్డాల నాని, కె.డి.ఎస్ నారాయణ, కృష్ణ కిషోర్, అలాగే అబుదాబి జనసైనికులు కిరణ్, సూర్య, స్వామి, చంటి, నరేష్, దుర్గా సాయి, ప్రత్యేకంగా ఇంచార్జి త్రిమూర్తులు, చంద్రశేఖర్ అభినందించారు. 40 మంది పైగా రక్తదానం చేశారు. కార్యకర్తలు ఎప్పుడూ సేవా కార్యక్రమాలలో ముందు ఉండాలి అనే జనసేన అధినేత ఆశయాలకు అనుగుణంగా గల్ఫ్ దేశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తునాము అని త్రిమూర్తులు తెలిపారు. రక్త దానం చేసిన కార్యకర్తలకు గల్ఫ్ జనసేన నుండి జనసేన గుర్తు గాజు గ్లాసు అభినందన పత్రం జాతీయ కన్వీనర్ చంద్రశేఖర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రజా ధనంతో నిర్వహిస్తున్న సిద్ధం అనే కార్యక్రమనికి మేముకుడా సిద్ధం అనే పోస్టర్ ని జనసేన నాయుకులు విడుదల చేశారు.