పాలకొండ జనసేన ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్

పాలకొండ నియోజకవర్గం: పాలకొండలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ శ్రీ కోటదుర్గమ్మ గుడి దగ్గర అధ్యక్షులు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి గుడి ఆవరణంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించగా క్యాంప్ లో 64 మంది జనసైనికులు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై అభిమానంతో నాలుగు మండలాల జనసైనికులు పాల్గొని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులకు 300 బైక్ కీ చైన్స్, 500 మొబైల్ స్టిక్కర్స్, 150 టీషర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది.