మెగాస్టార్ రాఖీ సెలబ్రెషన్

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సినీ సెల‌బ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రేక్ష‌కుల‌కు ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. తమ సోదరీమణులతో రాఖీ కట్టించుకున్న ఫొటోలను షేర్ చేసి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన చెల్లెళ్లతో రాఖీ కట్టించుకుంటున్న వీడియోని షేర్ చేసి నా ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని తెలిపారు.

ఇద్దరు చెల్లెల్లు వచ్చి మెగా బ్రదర్‌కు రాఖీ కట్టారు. అన్నయ్య ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్వీట్లు తినిపించి రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరు.. తన ఇద్దరు చెల్లెల్లకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు. ఇద్దరికి రెండు హారాలు బహుమానంగా అందించారు. ఇద్దరకీ ఒకేలాంటి గిఫ్ట్ ఇస్తున్నాను.. మళ్లీ కొట్టుకోకుండా అంటూ చిరు తన బహుమతిని అందించారు.