మైలవరం నియోజకవర్గంలో మెగా అభిమానుల మెగా సంబరాలు

  • మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా మైలవరం చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం

మైలవరం: మెగాస్టార్ కొణిదల చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఆదివారం రంగా (విగ్రహం)బొమ్మ సెంటర్ నందు ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చిరంజీవి అభిమానులు మరియు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కటింగ్-అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా వంగవీటి మోహన రంగా విగ్రహానికి మరియు మదర్ తెరిసా విగ్రహానికి పూల మాలలు వేసిన చిరంజీవి అభిమానులు, జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల గాంధీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటారి ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగులూరి ఆజాద్, కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు నాగులురి దుర్గాప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు బ్రహ్మయ్య, చిరంజీవి ఫ్యాన్స్ కరెడ్ల సీతయ్య, దద్దనాల శేషగిరిరావు, సాగా బుజ్జి, గంట రామ్మోహన్ రావు, గంట వాసు, గుర్రం వెంకటేశ్వరరావు, గోగులముడి సాంబిరెడ్డి, గజరాజు శ్రీనివాసరావు, లాలం నరేంద్ర, పసుపులేటి రాజేంద్ర, ఎర్రం శెట్టి క్రాంతి, మాదాసు సుబ్బారావు, కాంచన పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.