మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు..

మెగా ప్యామిలీలో క్రిస్మస్ సందర్భంగా వేడుకల్నిఘనంగా జరుపుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇంట క్రిస్మస్ సంబరాలు గ్రాండ్ గా ప్లాన్ చేశాడు. ఈ వేడుకల్లోనూ మెగా ఫ్యామిలీ యూత్ ఒకే చోట కలిసి సంతోషంగా గడిపింది. దీనికి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో మొత్తం మెగా ఫ్యామిలీ ఉంది. రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, ఆమె భర్త చైతన్య, అల్లు శిరీష్, సుష్మిత కొణిదెల, సాయి తేజ్, చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాన్ దేవ్.. ఇలా మొత్తం అల్లు ఫ్యామిలీతో పాటు, చిరంజీవి ఫ్యామిలీ ఒకదగ్గరకు వచ్చి ఈ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ ఫోటోను చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

మొత్తం మెగా ఫ్యామిలీ అంత ఒకే ఫ్రేమ్‌లో ఉంటూ కనులవిందు చేస్తోంది. ఈ క్రిస్మస్ పార్టీని రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన హోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మా అందరి నుండి మీకు క్రిస్మస్ శుభాకంక్షాలు.. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మెగా కజిన్స్ అందరూ సీక్రెట్ శాంతా ఆడారు.. ఈ పార్టీని హోస్ట్ చేసిన రామ్ చరణ్, ఉపాసనాలకు థాంక్స్ అంటూ అల్లు శిరీష్ ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇక ఆ పిక్‌లో రామ్ చరణ్ ఎప్పటిలాగే కోర మీసాలతో అదరగొడుతున్నాడు.