మెగాస్టార్ దంపతులకి మెగాపవర్ స్టార్ శుభాకాంక్షలు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నేడు చిరంజీవి దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, సురేఖ కొనిదెల 42వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా చరణ్ తన శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు మెగాస్టార్ దంపతుల ఫోటోను చెర్రీ ట్వీటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా ఈ శుభదిన సందర్భంగా మెగాస్టార్ దంపతులకు కామెంట్ల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూకుడు చూపుతున్నారు. తాజాగా చిరు చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా తరువాత లూసిఫర్, వేదాళం సినిమాలు ఉన్నాయి. ఆ తరువాత దర్శకుడు బాబీతో కూడా ఓ సినిమా చేయనున్నారు. ఇక చరణ్ విషయానికొస్తే చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత శంకర్ డైరెక్షన్‌లో తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేశారు. వీరిద్దరు ఆచార్య సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఆచార్య సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.