‘వీరయ్య’ గా మెగాస్టార్..?

మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ – మోహన్ రాజా డైరెక్షన్ లో ‘లూసిఫర్’ రీమేక్ లలో నటిస్తున్నారు చిరు. వీటి తర్వాత బాబీ సినిమా మరియు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదళమ్’ రీమేక్ లను ప్యారలల్ గా చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా నేపథ్యం – టైటిల్ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చేయబోయే సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగుతుందట. ఇంతకముందు బాబీ తీసిన సినిమాల తరహాలో ఎమోషన్ తో కూడిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందట. ఇదే కనుక నిజమైతే వింటేజ్ మెగాస్టార్ ని చూడటం ఖాయమని చెప్పవచ్చు. ఇకపోతే దీనికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందిస్తారని టాక్. అలానే తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఈ సినిమాకి ”వీరయ్య” అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.