ఫ్యామిలీ నడుమ మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్‌

ఎందరికో ఆదర్శం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహా మనిషి, అభిమానుల గుండెల్లో మెగాస్టార్‌గా కొలువు దీరిన మెగాస్టార్ చిరంజీవి 66వ బర్త్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అభిమానులు చిరంజీవి పేరున పూజలు చేయడమే కాక అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు మెగాస్టార్‌కి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఆయనతో పని చేస్తున్న దర్శకులు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశారు. అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ టీం అంతా చిరంజీవిని కలిసి ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక మెగా హీరోల నడుమ మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. నాగబాబు, పవన్ కళ్యాణ్‌, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్‌, ఉపాసన , సుస్మిత, శ్రీజ ఇలా అందరు చిరంజీవి ఇంట్లో ప్రత్యక్షం అయి సందడి చేశారు. రాఖీ కూడా అదే రోజు రావడంతో ఆ పండుగను కూడా ఉత్సాహంగా చేసుకున్నారు.







Rakhi festival celebrations in Mega Family