మెగాస్టార్ చేతికి గాయం

కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి, మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. అందుకే ఆదివారం రోజు తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి చిరు అభినందించారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.

అయితే ఈ కార్యక్రమంలో చిరు చేతికి కట్టుతో కనిపించారు. దీంతో చిరంజీవి చేతికి గాయమయ్యింది. షూటింగులో గాయపడ్డారా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వ్యాపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం గురించి మెగా కాంపౌండ్ టీమ్ స్పందించారు.

‘ఇంటిదగ్గర జిమ్ చేస్తుండగా చిరంజీవి చెయ్యి బెనికింది. ఒకటీ, రెండు రోజుల్లో డాక్టర్స్ కట్టు తొలగించానున్నారు. ఇది చాలా చిన్న విషయం. ఆందోళన చెందాల్సిన పని లేదు. చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ షెడ్యూలె ఈ నెల 14తో ముగిసింది. తర్వాతి షెడ్యూల్ నవంబర్ 1 నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగనుంది. చిరంజీవికి ఈ నెలాఖరు వరకు షూటింగ్ లేదు. ‘భోళా శంకర్’ షూటింగ్ నవంబర్ 11 న హైదారాబాద్‌లో ప్రారంభం కానుంది’ అని తెలిపారు.