గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన మెహబూబ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ 4 ఫేం మెహబూబ్  సోహెల్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా మెహబూబ్  మాట్లాడుతూ రోజు రోజు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. దాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు మెహబూబ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన మిత్రులు యాంకర్ లాస్య మంజులత, మోనాల్, జబర్దస్త్ అవినాష్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.