ఆగ్రాలో మెట్రో ప్రాజెక్ట్

ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ అందాలను త్వరలో మెట్రో రైలులో ప్రయాణిస్తూ వీక్షించవచ్చు. ఆగ్రాలో మెట్రో ప్రాజెక్ట్ పనులను ఇవాళ ఉదయం 11.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆగ్రాలో మెట్రో పరుగులు పెట్టడంతో స్థానిక ప్రజలు, పర్యాటకులకు జీవన సౌలభ్యం మెరుగుపడుతుందని ప్రధాని ట్వీట్ చేశారు. తాజ్ మహల్, ఆగ్రా ఫోర్టు, సికంద్ర పర్యాటక కేంద్రాలను రైల్వేస్టేషను, బస్ స్టాండ్లతో కలుపుతూ రెండు కారిడార్లతో మెట్రోరైలు మార్గాన్నినిర్మించనున్నారు. ఈ మెట్రోరైలు శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరిలు పాల్గొననున్నారు. రూ.8,379.62 కోట్లతో చేపడుతున్న మెట్రోరైలు ప్రాజెక్టును వచ్చే ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు.