ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మరియు వసతులు పరిశీలించిన విద్యార్థి విభాగం

భద్రాద్రి కొత్తగూడెం, జనసేన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో జనసేన పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పూసుగూడెం గ్రామపంచాయతీలో ఉన్నటువంటి యుపిఎస్ పాఠశాల నందు మధ్యాహ్న భోజనం మెనులో ఉన్న విధంగా భోజనం పెడుతున్నారు లేదా అని పరిశీలించడం జరిగింది. తరువాత పాఠశాల నందు పిల్లలకు నీటి సదుపాయం ఉన్నదా అని మూత్రశాలలో ఉన్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మూత్రశాలలు లేవని చెప్పడంతో ఈ పాఠశాల నందు 120 మంది విద్యార్థులు ఉన్నారు అయినా ఇప్పటివరకు మూత్రశాలలో నిర్మించకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తుందని జనసేన పార్టీ విద్యార్థి విభాగం పేర్కొనడం జరిగింది. త్వరగా మూత్రశాలలు నిర్మించాలని దానికి తగిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యులు గొల్ల వీరభద్రం మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం సెక్రటరీ గరిక రాంబాబు మరియు మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి వుకే నాగరాజు, కార్యదర్శి బాదావత్ రవికుమార్, గ్రామ కమిటీ నాయకులు బోలగాని పవన్ కళ్యాణ్, నక్కన రమేష్, ముదిగొండ సాగర్, వాంకుడోత్ కృష్ణబాబు, సురేష్, జె రమేష్ తదితరులు పాల్గొన్నారు.