రైతుబిల్లుల ఆమోదంపై మోదీ హర్షం

రైతు బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసారు. దేశంలో వ్యవసాయ రంగ చరిత్రను కొత్త మలుపు తిప్పిన ‘ఉద్యమం’తో దీన్ని పోల్చారు. ఇది భారత వ్యవసాయ రంగంలో ఓ ‘వాటర్ షెడ్ మూవ్ మెంట్’ అన్నారు. దేశంలోని రైతులను అభినందిస్తున్నానని, దశాబ్దాల తరబడి వివిధ ఆంక్షలు, మధ్య దళారుల వేధింపుల కారణంగా నష్టపోయిన అన్నదాతలకు ఈ బిల్లుల ఆమోదం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఆ కష్టాల నుంచి పార్లమెంట్ వారిని దూరం చేసిందన్నారు. ఈ బిల్లుల వల్ల వారి ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు.