హరివంశ్ నారాయణ్ సింగ్‌కు మోదీ శుభాకాంక్షలు

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్‌ ఎన్నికైన సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో  ప్రధాని స్పందిస్తూ… హరివంశ్ పట్ల తనకున్న గౌరవ భావమే సభలోని ప్రతి సభ్యుడు కలిగి ఉన్నాడన్నారు. ఆయన ఈ గౌరవాన్ని సంపాదించినట్లు తెలిపారు. పార్లమెంటు సమావేశాల నిర్వహణలో హరివంశ్ ప్రదర్శించే నిష్పాక్షిక పాత్ర మన ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉత్పాదకతను, సానుకూలతను పెంపొందించేందుకు ఆయన ప్రయత్నాలు చేశారన్నారు. ప్రజాస్వామ్య విలువలకు పెరుగాంచిన బిహార్ నుంచి వచ్చిన ప్రజాస్వామ్య టార్చ్ బేరర్ హరివంశ్ అని ప్రధాని కొనియాడారు.