ఉత్తరాఖండ్ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తరాఖండ్ 21వ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ట్విటర్లో స్పందించారు. అభివృద్ధిలో ఉత్తరాఖండ్ అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సహజ వనరులు, ప్రకృతి అందాలకు నిలయమైన ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగాలన్నారు. ”రాష్ట్రాతరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రగతి పథంలో పయనిస్తున్న ఈ రాష్ట్రం… మున్ముందు ఇదే ఒరవడితో మరిన్ని అభివృద్ధి శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను..” అని ఆయన ట్వీట్ చేశారు.