మొకిరి దినేష్ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన బొర్రా

సత్తెనపల్లి, మొకిరి దినేష్ (18) తన చెల్లిని నరసరావుపేట పరీక్ష కేంద్రానికి తీసుకు వెళ్తుండగా శాంతి నగర్ సమీపంలో ఆర్టీసి బస్సు ఓవర్ స్పీడ్ గా రావటం వలన బైక్ ని బస్సు ఢీ కొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో దినేష్ అక్కడికక్కడే మరణించగా తన చెల్లికి గాయలవటంతో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించటం జరిగింది. స్థానిక జనసైనికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ బాధ్యులు బొర్రా వెంకట అప్పారావు బాధిత కుటుంబ్బాన్ని పరామర్శించి తన కుటుంబానికి ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.