జనసేన శ్రేణుల ఆత్మీయ సమ్మేళనమునకు తరలిరండి

  • ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం జరుగబోయే కార్యకర్తలు జనసేన శ్రేణుల ఆత్మీయ సమ్మేళనమునకు భారీగా తరలిరావాలని రెడ్డి అప్పల నాయుడు పిలుపునిచ్చారు.. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు జనసైనికులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, మెగా ఫ్యామిలీ అభిమానులకు అందరికీ ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం సాయంత్రం 3 గంటలకు ఏలూరు జనసేన పార్టీ కార్యాలయం పక్కనున్నటువంటి స్థలంలో జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేయడానికి సమయం లేనటువంటి సోదరులు, సోదరీమణులు అందరూ ఎన్నికలు దగ్గర పడుతుండడం వలన మీరందరూ కూడా మీ విలువైన సమయాన్ని కొంత వెచ్చించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటంలో, ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి మీరందరూ కూడా సహకరించి రావలసిందిగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుండి ఆహ్వానం పలుకుతున్నాము.. ఈ ఆత్మీయ సమావేశానికి తప్పనిసరిగా అందరూ పాల్గొని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జెండా ఎగరవేయడం కోసం కావలసిన ఆలోచన ప్రణాళికను రచించడం కోసం వ్యూహాత్మకంగా ఈ రోజున ఉన్న అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దిశగా మనందరం కూడా పనిచేయాలని, ఈ కార్యక్రమానికి యువతీ యువకులు పెద్దలు మేధావి వర్గాలు అందరూ కూడా భారీ సంఖ్యలో హాజరు కావల్సిందిగా కోరుచున్నాము.