పారాదిలో జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

బొబ్బిలి నియోజకవర్గం: పారాదిలో మన ఊరు మన ఆట కార్యక్రమం జనసేన ఎంపిటీసీ అభ్యర్థి బంటుపల్లి దివ్య, బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉత్తరాంద్ర మహిళ రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్ విచ్చేసారు. ఈ ముగ్గుల పోటీలలో గెలిచిన మహిళలకు జనసేన పార్టీ తరఫున బహుమతులు ప్రధానం చేసారు. మొదటి బహుమతి ఉత్తరావల్లి శ్రావణి, రెండవ బహుమతి బెల్లాన శశిరేఖ, మూడవ బహుమతి ఆవాల గాయత్రి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మహంతి ధనుంజయ, బంటుపల్లి శంకర్, బెల్లాన శ్రీను, పేకేటి సురేష్, పున్నాన శేఖర్, పున్నాన సతీష్, బెల్లాన నవీన్ కుమార్, గిరిడి హరికృష్ణ, పొట్నూరు పురిషోత్తమరావు, పత్తిగుల్ల సాయి జనసేన వీరమహిళలు రామలక్ష్మి, అరుణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.