అంతరిక్ష శాస్త్రవేత్త కావాలన్నది నా డ్రీమ్

మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తరువాత పవర్‌స్టార్ పవన్‌కళ్యాన్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన `బద్రి` సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్ తన సినీ జీవితానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతాన్ని గుర్తు చేసుకుoది. అస్సలు తాను నటిని కావాలని కోరుకోలేదని అంతరిక్ష శాస్త్రవేత్త కావాలన్నది తన డ్రీమ్ అని చెప్పారు రేణు. అదికాకుంటే డాక్టర్ కావాలనుకున్నానని చెప్పింది. అయితే విధి మాత్రం తనను కెమెరా ముందుకు తీసుకొచ్చిందని తెలిపింది. నాసాలో శాస్త్ర వేత్తను కావాలనుకున్నతాను.. అలా జరగకపోయే సరికి చాలా బాధ పడ్డానని చెప్పింది. అది తనను కొన్నేళ్ల పాటు వెంటాడిందని తెలిపింది. 16 ఏళ్ల వయసులో తాను ఏమీ తెలియకుండానే కెమెరా ముందుకు వచ్చానని.. ఆ తర్వాత సినిమాలతో ప్రేమలో పడిపోయానని చెప్పింది రేణుదేశాయ్. ఇక, సినీ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత తన జీవితంలో జరిగిన అన్ని విషయాలు మీకు తెలుసంటూ ఆమె తన అనుభవాలను, వ్యక్తిగత అంశాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.