కూకట్ పల్లి “నా సేన కోసం నా వంతు”

కూకట్ పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు వనభోజన మహోత్సవ కార్యక్రమంలో భాగముగా కూకట్పల్లి జనసేన నాయకులు “నా సేన కోసం నా వంతు” కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యకమంలో జనసైనికులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వందకు పైన జనసైనికులు నాసేన కోసం నావంతులో భాగంగా లక్షకు పైగా విరాళాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వర్ధినేని దుర్గా శ్రీనివాస్, మెండా వెంకట్రావు, తుమ్మల మోహన్, కొల్ల శంకర్, దయాకర్, సుబ్బు, సాయి తదితరులు నిర్వహించారు.