సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్..!

గత ఏడాది కరోనా ఉదృతంగా ఉండడంతో ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితులలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సెకండ్ వేవ్ వలన కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. లాక్‌డౌన్ విధిస్తే ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని, ఎవరికి వారు స్వీయ లాక్‌డౌన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రెండు వారాల పాటు స్వీయ లాక్‌డౌన్ విధించుకున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ప్రభుత్వం లాక్‌డౌన్ పెడుతుందో లేదో కాని నేను మాత్రం వచ్చే రెండు వారాలు స్వీయ లాక్‌డౌన్ పెట్టుకుంటున్నాను. లాక్‌డౌన్ అనవసరం అంటారా? బయటపరిస్థితులు , గత నెల నుండి ఆసుపత్రులు చూస్తే అర్ధమవుతుంది. ఎంత మంది ఎంతలా కష్టపడుతున్నారో, ఇకనైన వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోని వైద్యులకు విశ్రాంతి ఇద్ధాం అంటూ నాగ్ అశ్విన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ దర్శకుడు త్వరలో ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు.చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.