ప్రవళిక కుటుంబాన్ని పరామర్శించిన నర్సంపేట జనసేన నాయకులు

తెలంగాణ, నర్సంపేట, దుగ్గొండి మండలం, బిక్కాజిపల్లి విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య విషయంలో వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు. దేశానికి పట్టు కొమ్మల్లాంటి యువత నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని నర్సంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జీ శివ కోటి యాదవ్ అన్నారు. గ్రూప్-1,2,3,4, పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు ఒక వైపు ఆధారాలున్న విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య విషయంలో మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలు సరికాదు అని జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు శివకోటి యాదవ్ అన్నారు. దేశానికి పట్టుకొమ్మలాంటి యువత నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరీ శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు సోమవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన గ్రూప్ 2 అభ్యర్థిని మర్రి ప్రవళిక కుటుంబ సభ్యులను శివకోటి యాదవ్ పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రవళిక మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి, ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రవళిక కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు వంగ మధు, ఓర్సు రాజేందర్, రోడ్డ శ్రీకాంత్, గద్దల కిరణ్, బర్ల నాగరాజు, పోశాల కార్తీక్, టేకుల రవి తదితరులు పాల్గొన్నారు.