పాపమ్మ పేట గ్రామంలో ఎన్.డి.ఏ కూటమి ప్రచారం

పాలకొండ నియోజకవర్గం: పాపమ్మ పేట గ్రామంలో ఇంటింటికి గాజు గ్లాసు గుర్తు – కమలం గుర్తు ప్రచార కార్యక్రమం నిర్వహించారు జనసేన, టీడీపి, బీజేపీనాయకుల ఆధ్వర్యంలో కూటమి మ్యానిఫెస్టో లోని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రావడం చాలా అవసరం పాలకొండలో టీడీపీ బీజేపీ కూటమి బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గారు గుర్తు గాజు గ్లాస్ గుర్తు 5వ నెంబర్ లో ఉంటుంది అలానే బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గారు గుర్తు 3వ నెంబర్ లో కమలం గుర్తుకి ఓటు వేయ్యాలి అని గ్రామ ప్రజలకు తెలియజేయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మరియు పాపమ్మపేట జనసేన నాయకులు రఘుమండల గణేష్, గోలి అనిల్, తోలాపు వాసు, పొగిరి జగన్, గొర్లె కుమార్, దలాయి కుమార్ పాల్గొన్నారు.