కొత్తపేట జనసేనలో నూతన చేరికలు

కొత్తపేట నియోజకవర్గం: కొత్తపేట గ్రామ మాజీ సర్పంచ్, ఎస్సీ సామాజివర్గ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు పల్లికొండ సుదీర్ కుమార్, శ్రీమతి జానకి దేవి, కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు, మండల అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.