గాదె సమక్షంలో జనసేనలో నూతన చేరికలు

గుంటూరు: వేమూరు నియోజకవర్గం, చుండూరు గ్రామం నుంచి మండల అధ్యక్షులు అమ్మిసెట్టి శ్రీరాములు, వాగోలు రమేష్ అధ్వర్యంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం జనసేన పార్టీ లోకి పెనుగుదురు పాడు సర్పంచ్ శోభారాణి భర్త రుద్రపాటి బుజ్జిబాబు, మంచాల దిలీప్, దుగ్గిరాల సునీల్, మంచాల నాగబాబు నూతనంగా జాయిన్ అయ్యారు. వీరిని అధ్యక్షులు వారు పార్టీ కండువా వేసి వారిని ఆహ్వానించడం జరిగింది. గతంలో వీరు వైసీపీ పార్టీ లో పనిచేసి ఉన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారిపై అభిమానంతో పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిట్రగుంట మల్లిక, నారదాసు ప్రసాద్, శిఖా బాలు, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, నెల్లూరు రాజేష్, గోపిసెట్టి సాయి, వేమూరు నాయకులు పాల్గొన్నారు.