ఎన్.హెచ్.ఆర్.సి.స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా జీ.వి. రమణారావు

  • నియామక పత్రాన్ని అందజేసిన ఎన్.హెచ్.ఆర్.సి. జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం పట్టణానికి చెందిన రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గొర్లి వెంకట రమణారావు (ఈనాడు రమణ) జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్. హెచ్.ఆర్.సి) స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియామకమైనట్లు ఎన్.హెచ్. ఆర్.సి.పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం పార్వతీపురం లారీ ఓనర్స్ యూనియన్ అసోసియేషన్ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెన్. హెచ్. ఆర్. సి. రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ ఉపాధ్యక్షులు కదిరి రాము ఆధ్వర్యంలో గత ఆదివారం విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో భాగంగా జీవి రమణారావును ఎన్.హెచ్.ఆర్.సి.స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించినట్లు తెలిపారు. గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు ముఖ్యమైన పదవుల తనదైన శైలిలో నిర్వర్తించిన రమణారావు జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమింపబడటం ఆనందదాయకమన్నారు. జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడైనా, ఎప్పుడైనా మానవ హక్కులకు భంగం కలిగిన నేపథ్యంలో బాధితులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొత్తగా నియమింపబడిన జీవీ రమణారావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రెసిడెంట్ కదిరి రాముకు, కమిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా తనకు అప్పగించిన బాధ్యతను తన శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానన్నారు.