నితిన్ – రానాల మధ్య ఫైట్

మార్చి 26 న నితిన్ , రానా లు బరిలోకి దిగబోతున్నారు. నితిన్, వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగ్ దే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మార్చి 26 న రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలనీ ముందుగా అనుకున్నప్పటికీ ..సంక్రాంతి బరిలో నాల్గు సినెమాలు ఉండడం , 50 % ఆక్యుపెన్సీ తో థియేటర్స్ నడుస్తుండడం తో నిర్మాతలు మార్చి 26 కు వాయిదా వేశారు.

ఇక ఇప్పుడు అదే రోజు రానా కూడా తన అరణ్య తో వస్తున్నాడు. ప్ర‌భు సాల్మ‌న్ డైరెక్షన్లో పాన్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలో వస్తుందని అనుకున్నారు కానీ ఇప్పుడు మార్చి 26న ఈ సినిమా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈరోస్ సంస్థ నిర్మించిన చిత్ర‌మిది. ఈ సినిమా కోసం రానా బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. బ‌రువు బాగా త‌గ్గాడు. చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనూ చాలా క‌ష్టాలు ఎదుర‌య్యాయి. మరి అన్ని కష్టాల నుండి బయటపడిన ఈ మూవీ రంగ్ దే చిత్రాన్ని ఎంతవరకు ఢీ కొడుతుందో చూడాలి.