ఎన్ని జన్మలైనా నువ్వు నా కూతురిగా పుట్టాలి: మోహన్ బాబు

నటిగా, వ్యాఖ్యాతగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మీ ప్రసన్న ఈ రోజు 43వ వసంతంలోకి అడుగుపెట్టింది. కూతురు పుట్టిన రోజు సందర్భంగా మోహన్ బాబు తన ట్విట్టర్ ద్వారా.. ఎన్ని జన్మలైనా నువ్వు నా కూతురిగా పుట్టాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని ట్వీట్ చేశారు. నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న వజ్ర వైఢ్యూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి కుమార్తె పుట్టిన రోజు ఈ రోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలియదు గానీ ఉంటే మళ్లీ ఈ లక్ష్మీ ప్రసన్నే నాకు కూతురిగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచ భూతాలని ప్రార్ధిస్తున్నాను, హ్యాపీ బర్త్‌డే టూ మై డియర్ లవ్లీ లక్ష్మీ మంచు అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.