ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జనసేనానితోనే నా ప్రయాణం

మంగళగిరి: జనసేనాని పవన్ కళ్యాణ్ ని జిల్లా ప్రచార కార్యదర్శి మల్లువలస శ్రీను ఆదివారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. భిన్న వృత్తులు నిర్వహిస్తున్న యువతతో భేటీ నిర్వహించారు. యువతకు ఉపాధి, భవిష్యత్ గురించి వారి సందేశం అందించారు. ఈ సందర్భంగా మల్లువలస శ్రీను మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నేను 2009 పి.అర్.పి నుంచి మొదలైన మెగా ఫ్యామిలీ మీద అభిమానం 2014 జనసేన నుంచి ఆరాధనగా మారింది. మీతో నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. నీ సిద్ధాంతాలు, ఆలోచనలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మీతో కలిసి అడుగు ముందుకు వేయడం ప్రారంభించాం.2018 లో మొదటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు అనుకున్నా.. ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీతోనే నా ప్రయాణం. అది ఎప్పటికీ ఆగదు. మరొక్కసారి మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు. నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యతలకు న్యాయం చేస్తూ మీ స్ఫూర్తితో పని చేస్తాను. కృతజ్ఞతలు అన్నయ్య అంటూ కృతజ్ఞతలు తెలిపారు.