‘నో పార్కింగ్‌’.. ‘గేర్ మార్చి బండి తియ్’

అక్కినేని ఫ్యామిలీనుండి వచ్చిన యువ నటుడు సుశాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్‌’ అన్నది ఉపశీర్షిక. ఎస్‌. దర్శన్‌ దర్శకత్వంలో రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 20) అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దానికి ‘ఏయన్నార్‌ లివ్స్‌‌ ఆన్‌’ అని పేర్కొన్నారు. ఈ పోస్టర్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై దూసుకెళ్తూ సుశాంత్ కనిపిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఆగి పోయిన షూటింగ్ వచ్చేవారం పునఃప్రారంబం కాబోతుందని చిత్ర బృందం ప్రకటించింది.

ఏఎన్ఆర్ జయంతి సందర్బంగా ఆయన్ని స్మరించుకుంటూ ‘ఆప్యాయత నిండిన జ్ఞాపకాలన్నీ ఈ రోజు కళ్లల్లో మెదులుతున్నాయి. తాతా.. మీ లాగా ఇంకెవరూ ఉండరు. మీ జీవితంలో ఒక చిన్న భాగమైనందుకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అని సుశాంత్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

‘మార్చి పోయి సెప్టెంబర్‌ వచ్చింది.. గేర్‌ మార్చి బండి తియ్‌!’ అని మరో ట్వీట్‌ చేశారు సుశాంత్‌. ఈ సినిమాలో  సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్నారు.