రంగుల మీద కాదు పేర్ని!.. అభివృద్ధి మీద దృష్టిపెట్టు!!: ఎస్.వి.బాబు

  • పవన్ వారాహి వాహనంపై పేర్ని సెటైర్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఎస్.వి.బాబు

పెడన: వారాహి వాహనానికి పసుపు రంగు వేయండి అంటూ .. పేర్ని నాని చేసిన వ్యాక్యలపై స్పందించిన పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్ వి బాబు మాట్లాడుతూ..

*వారాహి వాహనం రంగు, కళ్యాణ్ చెప్పులు రంగులు చూడటం మానేసి అభివృద్ధి మీద దృష్టిపెట్టు పేర్ని

*ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే వైసిపి నాయకుల ప్యాంట్లు తడుస్తాయని తెలుసు, పవన్ కళ్యాణ్ గారి వాహనాన్ని చూసిన నీకు తడిసిపోతుందంటే, భవిష్యత్తులో మా విజయం తథ్యం అని అర్థమవుతుంది

*మీలాగా కనబడిన ప్రతిదానికి పార్టీ రంగు వేసే సంస్కృతి, సాంప్రదాయాలు జనసేన పార్టీలో లేవు

*పవన్ కళ్యాణ్ గారి వాహనం రంగు, కళ్యాణ్ గారు చెప్పులు రంగులు చూడటం మానేసి, మచిలీపట్నం అభివృద్ధి మీద దృష్టిపెట్టు పేర్ని

*బందరును ఎలాంటి అభివృద్ధి చేయని మాజీ బందర్ మంత్రివి నువ్వు

*ముందు నీ బందర్ వేషాలు మాని, ప్రజల్లోకి వెళ్ళు

*కేవలం ప్రెస్ మీట్ లకే పరిమితమైన నీకు వాస్తవ పరిస్థితులు అర్థం కావడం లేదు

*మచిలీపట్నం ప్రజలు నిన్ను అసహ్యించుకుంటున్నారు

*తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నీలాంటి పాలేరు నాయకులకు కాలం చెల్లింది

*పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద మీరెంత విషం కక్కినా.. 2024 చరిత్ర సృష్టించే పార్టీ జనసేననే అని ఎస్ వి బాబు అన్నారు.