డ్రగ్స్ కేసులో తనీష్‌కు బెంగళూరు పోలీసుల నోటీసులు

కర్ణాటకలో ఇటీవల కలకలం రేపిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలంటూ టాలీవుడ్ నటుడు తనీష్‌కు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు జరిగే విచారణకు హాజరు కావాలంటూ మొత్తం ఐదుగురికి నోటీసులు ఇవ్వగా అందులో ఓ సినీ  నిర్మాత, పారిశ్రామికవేత్త కూడా ఉన్నారు. తనీష్‌కు నోటీసులు పంపినట్టు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. 2017లో అప్పట్లో తెలుగు చిత్రపరిశ్రమను ఊపేసిన డ్రగ్స్ కేసులోనూ తనీష్ సిట్ ఎదుట హాజరయ్యాడు.

డ్రగ్స్ కేసును విచారిస్తున్న బెంగళూరులోని బాణసవాడి పోలీసులు తొలుత ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసి విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు మస్తాన్, విక్కీ మల్హోత్రా పేర్లు బయటకు వచ్చాయి. మస్తాన్ ను విచారిస్తున్న సమయంలో సినీ నిర్మాత శంకర్‌గౌడ పేరు వెలుగులోకి వచ్చింది. గౌడ తన కార్యాలయంలో ఇచ్చే పార్టీలకు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యేవారని పోలీసులు తెలిపారు.