ఎన్టీఆర్ కి టాలీవుడ్ లో 20 ఏళ్ళు.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న అభిమానులు

బాల రామాయణంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత నాలుగేళ్లకు నిన్ను చూడాలని అంటూ సోలో హీరోగా అడుగు పెట్టి 20 ఏళ్ళు పూర్తీ చేసుకున్నాడు.  స్టూడెంట్ నెం 1 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 2002లో వచ్చిన ఆది సినిమాతో తొలి మాస్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ రికార్డులకు చెక్ పెట్టాడు. ఇక తర్వాత మళ్ళీ సింహాద్రి సినిమా తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి తక్కువ ఏజ్ కే ఊహకందని క్రేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్,  ఈ సినిమాతో ఎన్నో రికార్డులని తన ఖాతాలో వేసుకున్నాడు.  తర్వాత 2007లో యమదొంగతో మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత కంత్రి సినిమా కొద్దిగా నిరాశపరచగా, అదుర్స్, బృందావనం, బాద్షా లాంటి సినిమాలతో సత్తా చూపించాడు. మళ్ళీ హిట్స్ అండ్ ఫ్లాఫ్స్ పడుతున్న టైం లో బాద్ షా తో కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకోగా తర్వాత 2015లో టెంపర్ నుండి నాన్ స్టాప్ గా ఇప్పటి వరకు ఒక్క అపజయం లేకుండా ఎన్టీఆర్ విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత లాంటి సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు కామన్ డీపీని విడుదల చేశారు. ఇందులో ఆయన నటించిన సినిమాల పాత్రలతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఆయుధాన్ని చూపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సీడీపీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.