సేంద్రియ బెల్లం తయారీ రైతులను ఆదుకోవాలి: జనసేన డిమాండ్

బొబ్బిలి: రైతులు సేంద్రియ పద్దతిలో తయారు చేసిన బెల్లాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. లేదంటే రైతులతో సహా మా జనసేన పార్టీ నాయకులం కూడా ఆమరణ దీక్షకు దిగుతామని టీటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, బొబ్బిలి నియోజకవర్గ మండల అధ్యక్షులు, నాయకులు మరియు రైతులు వినతి పత్రం ఇచ్చారు. ఈ జూన్ నెల 18వ తేదీ లోపు తప్పనిసరిగా కొనుగోలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన వై.వి సుబ్బారెడ్డి. హామీ నెరవేర్చకపోతే, తక్షణమే నిరాహార దీక్షకు దిగుతామని స్పష్టం చేసిన జనసేన నేత బాబు పాలూరు.