జోరుగా సాగుతున్న వెలిగొండ ప్రాజెక్ట్, మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం పాదయాత్ర

  • వెలిగొండ ప్రాజెక్ట్, మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం పాదయాత్ర 3వ రోజు

మార్కాపురం: ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ తలపెట్టిన పాదయాత్ర మూడవ రోజు నాగిరెడ్డిపల్లి, మర్రిపాలెం, చౌటపల్లి, ఏదురాళ్లపాడు, గ్రామాల మీదుగా కొనకనమిట్ల గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఈ పాదయాత్రలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతంగా సాగుతుంది. ఈ పాదయాత్రకు కలుజువ్వలపాడు గ్రామస్థులు సంఘీభావం తెలియజేశారు.