వాటర్ డిస్పెన్సెర్ ను ప్రారంభించిన పద్మ రెడ్డి, బి.వి.ఆర్ మూర్తి

విశాఖపట్నం, మువ్వలవానిపాలెం పోలీసు స్టేషన్ లో, ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శివ్ వడ్లమూడి ప్రజల వినియోగార్ధం అందించిన బ్లూ స్టార్ వాటర్ డిస్పెన్సెర్ (హాట్ & కోల్డ్), సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో, కార్పొరేటర్ పద్మ రెడ్డి, విశాఖ జిల్లా న్యాయస్థానం పిపి బి.వి.ఆర్ మూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బి.వి.రాఘవ శ్రీనివాస్, ప్రతినిధులు రవితేజ, రౌతు బాలాజీ, జాయింట్ సెక్రెటరీ వీరేశ్వర రావు, కొండేటి భాస్కర్, ఎస్.గిరి, ట్రెజరర్ జోగీంద్రనాధ్ సాయి పాల్గొన్నారు.. బి.వి.ఆర్.మూర్తి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శివ్ వడ్లమూడిని, సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ ని అభినందించారు. వాటర్ డిస్పెన్సెర్ అందించినందుకు సిఐ మల్లేశ్వరరావు శివ్ వడ్లమూడికి ధన్యవాదాలు తెలియజేశారు.