టిక్ టాక్ ను అన్ బ్లాక్ చేసిన పాకిస్థాన్

టిక్​టాక్​పై పాకిస్థాన్ బ్యాన్ ఎత్తివేసింది. అనైతిక కంటెంట్​ను నియంత్రిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో పాకిస్థాన్ టెలికాం అథారిటీ(పీటీఏ) టిక్​టాక్​ను అన్​బ్లాక్ చేసింది.

‘అసభ్య, అనైతిక కంటెంట్​ను వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను కంట్రోల్‌లో పెడతామని టిక్​టాక్ యాజమాన్యం నుంచి హామీ వచ్చిన తర్వాత బ్యాన్ తొలగించాలని నిర్ణయించాం. స్థానిక చట్టాలకు అనుగుణంగా అకౌంట్లను టిక్​టాక్ రివ్యూ చేస్తుంది.’ అని పీటీఏ పేర్కొంది.

అనైతిక, అసభ్యకర కంటెంట్​కు వ్యతిరేకంగా వివిధ వర్గాల నుంచి కంప్లైంటులు అందిన నేపథ్యంలో అక్టోబర్ 9న టిక్​టాక్​పై పీటీఏ బ్యాన్ చేస్తూ పాకిస్థథాన్ సంచలన నిర్ణయం తీసుకంది. నోటీసులపై స్పందించేందుకు కావాల్సిన సమయం ఇచ్చినా.. ఆ సంస్థ పూర్తి రూల్స్ పాటించక విఫలమైందని అప్పట్లో పేర్కొంది. కాగా పాక్​లో టిక్​టాక్​కు మంచి ప్రాచుర్యం లభించింది. ఆ దేశంలో యాప్ డౌన్​లోడ్​లు 4.3 కోట్లు దాటాయి. 2020 సంవత్సరంలోనే 1.47 కోట్ల మంది యాప్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారు.