మనోభావాలను దెబ్బ తీసే ఫ్లెక్సీలను తొలగించాలని పాలకొల్లు జనసేన వినతి

పాలకొల్లు పట్టణంలో అధికార పార్టీ అహంకారంతో జనసేన నాయకుడిని హేళన చేస్తూ ఫ్లెక్సీలు పెట్టారు, ప్రశాంతంగా ఉండే పాలకొల్లు పట్టణాన్ని రాజకీయంగా మనుషుల మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు జనసైనికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వెంటనే అధికారులు తొలగించాలని పాలకొల్లు జనసేన నాయకులు పట్టణ మున్సిపల్ కమీషనర్ కి మరియు పాలకొల్లు ఎమ్మార్వోకి పాలకొల్లు ఎస్ఐకి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.