టీడీపీ నేత పోలీనాటి శేషగిరిపై జరిగిన దాడిని ఖండించిన పంతం నానాజీ

తుని నియోజకవర్గం: తుని నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పోలీనాటి శేషగిరిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. తీవ్రంగా గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేషగిరి ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శేషగిరి గారిపై ఈ విధంగా దాడి చేయడం చాలా దారుణమని, దాడి చేసిన వాడిని, చేయించిన వాడిని కూడా త్వరగా పట్టుకుని తగిన విచారణ చేసి దీనివెనుక వైసీపీ నాయకులు, గాని, మంత్రి అనుచరులు గాని, మంత్రి గాని ఉన్నా ఉపేక్షించకుండా శిక్ష వేయాలని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అన్ని సంగటితమైతే (మీ వైసీపీ) పార్టీ నాయకుల పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచన చేయాలని కోరారు.