కుల, మతాలకు అతీతంగా పసుపులేటి ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు: దారం అనిత

ప్రజలకు సేవ చేయాలనే బలమైన సంకల్పం ఉంటే‌ ఏదైనా సాధించవచ్చనని.. అందుకు పసుపులేటి ఛారిటబుల్ ట్రస్ట్ గొప్ప ఉదాహరణ అని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత పేర్కొన్నారు. ‌గురువారం మదనపల్లె టౌన్ సిటిఎం రోడ్డు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీపంలో పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, కడప పసుపులేటి విశ్వనాథ్, రైల్వేకోడూరు సుబ్బారాయుడు, శంకర సునీల్, కమలాపురం శ్రీనివాసులు, మైదుకూరు వినోద్ కుమార్ ముఖ్య అతిధిలుగా హాజరైనారు. ‌ఈ సందర్భంగా దారం అనిత మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో వున్న పసుపులేటి వంశస్థులు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. పేదలకు సాయం చేయాలనే గొప్ప సంకల్పంతో పసుపులేటి వంశస్థులు పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగిందన్నారు. పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుల, మతాలకు అతీతంగా పేద ప్రజలకు సహాయ పడాలనే వారి ఆలోచన విధంగా గొప్పగా వుందని కితాబునిచ్చారు. పసుపులేటి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని వెల్లడించారు. ‌ఇతరులు ఎవరైనా పసుపులేటి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవ చేయడానికి ముందుకు వస్తే తగిన విధంగా సహకారం అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుండి పలువురు ‌ప్రముఖలు హాజరైనారు. ‌