జనం కోసం పవన్ -పవన్ కోసం మనం ప్రారంభించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లోని ప్రచారం నిర్వహణలో భాగంగా ఆదివారం నేమం గ్రామంలో నేమం జనసేన నాయకులు దాసరి శివ, పోసిన శివ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ప్రచారం ప్రారంభించడం జరిగింది. జనం కోసం పవన్ – పవన్ కోసం మనంలో భాగంగా రాబోయే రోజుల్లో జనసేనకి మద్దతు ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ ని, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ నేమంలో ఎల్విన్ పేట, శెట్టిబలిజ పేట ఎస్సి పేటలలో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసారు. నేమం శివాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం గంగనపల్లి గ్రామం నుండి టీడీపీ నాయకులు రమేష్, వారి అనుచరులు సుమారు 50 మంది జనసేన జిల్లా నాయకులు శిరంగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, సిటీ,మండల, గ్రామం స్థాయి నాయకులు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు.